నేడు చివరి విడత రైతు భరోసానిధుల విడుదల

July 10, 2026


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం చివరి విడత నిధులు నేడు విడుదల కానున్నాయి. ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రూ.1,009 కోట్లు విడుదల చేయగానే ఆ సొమ్ము రైతుల ఖాతాలలో జమా అవుతాయి. .

ఇప్పటికే ప్రభుత్వం రూ.7750.45 కోట్లు ఈ పధకం కింద విడుదల చేసింది. నేడు విడుదల చేయబోయే నిధులతో కలిపి మొత్తం రూ.8759 కోట్లు. దీంతో సుమారు 74 లక్షల మంది రైతులకు లబ్ది కలిగింది.  

వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించడం, సాగుకు అవసరమైన మూలధనాన్ని సకాలంలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఖరీఫ్ సీజన్ సాగు పనులు జోరందుకున్న నేపథ్యంలో రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ కావడం వ్యవసాయ కార్యకలాపాలకు ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు.


Related Post