మనవడి కోసం సిఎం రేవంత్ రెడ్డి పూరీలు

July 09, 2026
img

దేశానికి రాజైనా ఓ తల్లికి బిడ్డడే అన్నట్లు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మనుమడికి ఆయన తాత మాత్రమే.

ఈరోజు పూరీలు కావాలని మనుమడు మారం చేస్తే సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా పిండి ఒత్తి పూరీలు తయారు చేశారు. అయితే ఆయన పిండి ఒత్తుతుంటే అవి గుండ్రంగా రావడం లేదని మనుమడు కామెంట్స్ చేస్తుంటే మళ్ళీ గుండ్రంగా చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు.

వంటింట్లో ఆయన పక్కనే గట్టు మీద కూర్చున్న మనుమడు పూరీలు రౌండుగా రావడం లేదని కామెంట్ చేస్తూనే ఉన్నాడు. సిఎం రేవంత్ రెడ్డి ఎలాగో తిప్పలు పడి ఓ డజను పూరీలు తయారుచేసి హమ్మయ్య అనుకున్నారు.

బిజీబిజీగా సాగుతున్న ప్రజాజీవితంలో మనమడితో కలిసి పూరీలు వేస్తూ ఈ కొన్ని క్షణాలు మధుర జ్ఞాపకాలు,” అంటూ ఆ వీడియోని సిఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/QjXNteb_5PA?si=FnrlJJgOAgWzLtk3" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post