మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా చేస్తున్న‘కొరియన్ కనకరాజు’ విడుదలకి ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్ట్ 7న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మేర్లపాక గాంధీ; సంగీతం: తమన్; కెమెరా: మనోజ్ రెడ్డి, ఆర్ట్: పనీర్ సెల్వం; చేస్తున్నారు.
దక్షిణ కొరియా నేపధ్యంలో హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు మేర్లపాక్ గాంధీ తెలిపారు. హర్రర్, కామెడీ పూర్తి భిన్నమైన జోనర్లే అయినప్పటికీ తెలుగు సినిమాలలో ఈ ప్రయోగం విజయవంతం అవడంతో అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మిస్తున్నారు.