ఎంఆర్‌పి... నీకెంత, నాకెంత?

July 11, 2026


img

వెన్నెల కిషోర్, నరేశ్ అగస్త్య, సుదర్శన్ ప్రధాన పాత్రలలో ‘ఎంఆర్‌పి... సబ్ టైటిల్‌ నీకెంత, నాకెంత? అంటూ ఓ చక్కటి కామెడీ సినిమాని సిద్దం చేశారు. తీసిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. 

శ్రవణ్ జేస్టా దర్శకత్వంలో తీసిన ఈ సినిమాలో కసిరెడ్డి రాజ్‌కుమార్, డోనల్ బిష్ట్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీరాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కథ: అశోక్ బొబ్బారెడ్డి; డైలాగ్స్: వెంకట్; డి.పాటి; సంగీతం: అజయ్ అరసాడ; కెమెరా: రాకేష్ కొలంచి; ఆర్ట్: కేవీ రమణ ; స్టంట్స్: నందు; ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ చేశారు. 

ఈ సినిమాకి దర్శకత్వం చేసిన శ్రవణ్ జేస్టా స్వయంగా ఈ సినిమా నిర్మించడం మరో విశేషం. ఈ నెల 17న థియేటర్లలో ఎంఆర్‌పి విడుదల కాబోతోంది. అప్పుడే చూసుకోవాలి నీకెంత, నాకెంత?అని.   


Related Post

సినిమా స‌మీక్ష