తిరువీర్, ఐశ్వార్య రాజేష్ జంటగా చేసిన ‘ఓ సుకుమారి’ టీజర్ విడుదలైంది. ఊళ్ళో ఓ అమ్మాయికి ఓ సమస్య ఉంది. ఆ కారణంగా ఆమెకు పెళ్ళి జరగడం లేదు. అప్పుడు అమాయకుడైన హీరో ఎంట్రీ ఇచ్చి తొలి దశ చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఊళ్ళో అందరూ ఆమె సమస్యని దాచి పెట్టి వారికి పెళ్ళి చేసేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథ అని టీజర్‌లోనే చెప్పేశారు.
ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, ఆనంద్, ఝాన్సీ, అంజిమామ, శివానంద్, కోట జయరాం తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు దర్శకత్వం: భరత్ దర్శన్; సంగీతం: భరత్ మంచిరాజు; కెమెరా: సి.హెచ్.కుశేందర్; డైలాగ్స్: ఆర్ట్: తిరుమల ఎం. తిరుపతి; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్ చేశారు.
గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.