అఖిల్ లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్‌ రిపోర్ట్

July 11, 2026


img

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేసిన ‘లెనిన్’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకోవడంతో అక్కినేని కుటుంబం, వారి అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. అఖిల్ తండ్రి నాగార్జున కాళ్ళకు నమస్కరించగా అయన కొడుకుని ఆప్యాయంగా కౌగలించుకున్నారు.

దీనిని బట్టి వారు ఈ విజయానికి ఎంతగా సంతోశిస్తున్నారో అర్ధమవుతుంది. అనేక ఏళ్ళుగా సరైన హిట్ లేక అవస్థ పడుతున్న అఖిల్‌కి ఈ విజయం చాలా ముఖ్యం. ఇది మళ్ళీ అతనిలో ఆత్మవిశ్వాసం నింపిందని భావించవచ్చు.    

లెనిన్‌కి ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్స్‌ రూ. 16.7 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఓ పోసర్ట్ విడుదల చేసింది. లెనిన్‌కి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు రెండో రోజు నుంచి కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.      

ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష