మా ఇంటి బంగారం వంద కోట్లు!

July 12, 2026


img

నందిని రెడ్డి-సమంత కాంబినేషన్‌కి తిరుగులేదని మరోసారి నిరూపించిన ‘మా ఇంటి బంగారం’ గత నెల 19న విడుదలై మంచి కలెక్షన్స్‌తో ఇంకా దూసుకుపోతోంది. నెలరోజులు పూర్తికాక ముందే వంద కోట్లు కలెక్షన్స్‌ సాధించింది. ఈరోజుల్లో ఒక హీరోయిన్ ఓరియంటడ్‌ సినిమా వంద కోట్లు కలెక్షన్స్‌ సాధించడం మామూలు విషయం కాదు. ఈ నెలాఖరులోగా జియో హాట్ స్టార్ ఓటీటీలో మా ఇంటి బంగారం వచ్చేస్తోందని తెలిసి ఉన్నా ఇంకా ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా చూస్తూనే ఉన్నారని తాజా కలెక్షన్స్‌ చెపుతున్నాయి. 

ఈ సినిమాలో గౌతమి, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.   

ఈ సినిమాకు కధ: రాజ్ నిడిమోరు, వసంత్ మరింగంటి, దర్శకత్వం: నందినీ రెడ్డి, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: ఓం ప్రకాష్, డైలాగ్స్: ఆర్ట్: స్టంట్స్: లీ విట్టకేర్, ఎడిటింగ్: ధర్మేంద్ర కాకర్ల చేశారు.

సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరి కలిసి ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కించారు. దీనికి సీక్వెల్ ఉంటుందని రాజ్ నిడిమోరు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Related Post

సినిమా స‌మీక్ష