డెలివరీ బాయ్స్ పట్ల కరుణ, జాగ్రత్త రెండూ అవసరమే

July 12, 2026
img

స్విగ్గీ, జొమోటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లేదా మరొకటి... దేశ ప్రజలు ఇప్పుడు వాటి ద్వారా అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలు, కూరగాయలు, మందులు ఇంటి వద్దనే అందుకోగలుగుతున్నారు. అంతేగాక ఆయా సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ‘డెలివరీ బాయ్స్’గా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి.

ఎండనక వాననక,రేయనక పగలనక, పండగలు పబ్బాలు ఇలా ఎప్పుడైనా సేవలు అందిస్తున్న ‘డెలివరీ బాయ్స్’ పట్ల మానవతా దృక్పదంతో వ్యవహరించడం అవసరం. అయితే వారిలో కొందరు పరిస్థితులను బట్టి చెడుగా ప్రవర్తిస్తుంటారు. కనుక అప్రమత్తంగా ఉండటం కూడా అవసరమే. 

బెంగళూరులో ఓ డెలివరీ బాయ్ ఓ ఇంటికి డెలివరీ ఇచ్చేందుకు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహిత మహిళ వారిస్తున్నా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి టాయిలెట్ వాడుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె షాక్ అయ్యింది. 

వెంటనే భర్తకి ఫోన్ చేసి చెప్పారు. తనకు ఎదురైనా ఈ చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకు కూడా తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆమె చెప్పిన వివరాలు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ డెలివరీ బాయ్‌ని గుర్తింఛి అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందం గాలిస్తోంది. 

కనుక డెలివరీ బాయ్స్ పట్ల కాస్త కరుణతో పాటు కాస్త అప్రమత్తంగా ఉండటం కూడా అంతే అవసరం. ముఖ్యంగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, మహిళలు, టీనేజ్ పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం.        

Related Post