అయ్యో! హరీష్‌ భాష కూడా మారిందే!

July 12, 2026

img

బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గొప్ప మాటకారే కావచ్చు. కానీ సిఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చాలా చులకనగా, అనుచితంగా మాట్లాడుతుంటారు.

కేటీఆర్‌తో పోలిస్తే హరీష్‌ రావు చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. సిఎం రేవంత్ రెడ్డి విషయంలోనైన ఆయన విమర్శలు, భాష ఆమోదయోగ్యంగానే ఉంటాయి. కానీ ఇప్పుడు అయన కూడా ఆ బ్యాలన్స్ కోల్పోయినట్లు సిఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశ్యించి “ఈ చిల్లరగాడు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పాలా?’ అని అన్నారు.

“దేవాదుల పంప్ హౌసులో పది మోటార్లు ఉంటే అన్నిటినీ ఆన్ చేసి నీళ్ళు ఎతిపోయకుండా గాడిదలు కాస్తున్నాడా? లేక గాడిదలకు పళ్ళు తోముతున్నాడా?” అని హరీష్‌ రావు అడిగారు.

ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ, “హరీష్‌ రావు ఢిల్లీలో బిజేపి పెద్దలతో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏదో రోజు బీఆర్ఎస్‌ పార్టీని బిజేపిలో విలీనం చేసేయడం ఖాయం,” అని అన్నారు. ఆయన తన విశ్వసనీయతని ప్రశ్నించడంతో హరీష్‌ రావు సహనం కోల్పోయినట్లున్నారు. కానీ ఇంతకాలం చాలా హుందాగా జవాబిచ్చే హరీష్‌ రావు నోట ఇటువంటి మాటలు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అయితే టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనని ‘గుంట నక్క’ అని సంభోదిస్తూ ఇంతకంటే చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా స్పందించని హరీష్‌ రావు, సిఎం రేవంత్ రెడ్డి అంటే ఈవిధంగా విరుచుకు పడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

రేవంత్ రెడ్డి లాంటి చిల్లర గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

నా గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉందా?

చొక్కాలు మార్చినట్లు పార్టీలు మార్చిన నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా?

నా పుట్టుక బీఆర్ఎస్ పార్టీలోనే, చావు బీఆర్ఎస్ పార్టీలోనే అని ఎన్నో సార్లు చెప్పాను… pic.twitter.com/H8bjJ55plw
— RTV (@RTVnewsnetwork) July 12, 2026

Related Post