‘తండేల్’ తర్వాత నాగ చైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ మొదలుపెట్టి దాదాపు పూర్తి చేశారు. దాని నుంచి బయటకు రాగానే వెంటనే మరో సినిమా మొదలు పెట్టేందుకు ఒకేసారి ఇద్దరు దర్శకులు చెప్పిన రెండు కథలు ఓకే చేసినట్లు సమాచారం. వారిలో ఒకరు సాయి కిరణ్ కాగా మరొకరు క్లాక్స్.
సాయి కిరణ్ దర్శకుడుగా పరిచయమైన తొలి సినిమా ‘మసూద.’ అదీ ఓ హర్రర్ సినిమా. తిరువీర్ ప్రధాన పాత్ర చేసిన ఈ సినిమా హిట్ అవడంతో సాయి కిరణ్‌కి మంచి దర్శకుడుగా పేరు సంపాదించుకున్నారు.
దాని తర్వాత మరో హర్రర్ సినిమాకి కథ సిద్ధం చేసుకొని ఈసారి నాగ చైతన్యకి చెప్తే ఆయన ఓకే చెప్పేశారు. అయితే నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కుమార్ దర్శకత్వంలో ‘దూత’ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా దూత-2 చేస్తున్నారు.
కనుక అది కూడా పూర్తయిన సాయి కిరణ్‌తో సినిమా మొదలు పెడతారా లేదా రెండూ ఒకే సమయంలో చేస్తారా? అనేది త్వరలో తెలుస్తుంది.
సాయి కిరణ్‌తో అనుకున్న సినిమా, దూత-2 వెబ్ సిరీస్ రెండూ పూర్తయిన తర్వాతే క్లాక్స్ తో సినిమా చేయగలుగుతారు. బహుశః ఈ రెండూ పూర్తిచేసేందుకు కనీసం ఆరేడు నెలలు పట్టవచ్చు. కనుక నాగ చైతన్య వచ్చే ఏడాది మరో సినిమా మొదలుపెట్టగలరు. అంతవరకు క్లాక్స్ ఎదురుచూడక తప్పదు.