నాగార్జున 100వ చిత్రంగా ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కనుక త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లిమ్స్, లిరికల్ వీడియో సాంగ్స్, టీజర్, ట్రైలర్ వరుసగా వచ్చేస్తాయి.
కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌లో సీనియర్ నటి టబూ నాగార్జునకు జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పూర్తవుతుండటంతో నాగార్జున 101వ సినిమాని లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో నాగార్జున ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది.