రా ఎన్టీఆర్... ఇదెక్కడి కొత్త తలనొప్పిరా?

July 14, 2026


img

జూ.ఎన్టీఆర్‌ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినప్పటికీ ఆ తర్వాత దానికి పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. కానీ ఎపీలోని వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అప్పుడప్పుడు అయన పేరు, పోస్టర్స్ వాడుకుంటూనే ఉంటుంది. కానీ జూ.ఎన్టీఆర్‌ ఆ పార్టీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నడూ టచ్‌లో లేరు.

తాజాగా జూ.ఎన్టీఆర్‌కిమారో కొత్త తలనొప్పి మొదలైంది. ‘రా (ఆర్‌ఎడబ్ల్యూ ఎన్టీఆర్) పేరుతో ఒక సంస్థ లేదా కొందరు వ్యక్తులు ఆయన తరపున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తమకు జూ.ఎన్టీఆర్‌తో మంచి పరిచయం ఉందని అయన తరపునే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది దృష్టికి వచ్చింది. దీనిపై జూ.ఎన్టీఆర్‌ కార్యాలయం వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదల చేసింది.

సదరు సంస్థతో అది నిర్వహించే కార్యక్రమాలతో గానీ జూ.ఎన్టీఆర్‌కి ఎటువంటి సంబందమూ లేదని దానిలో పేర్కొంది. జూ.ఎన్టీఆర్‌ పేరుతో కార్యక్రమాలు జరిపేందుకు, ఆయన పేరుతో నిధులు సేకరించేందుకు ఎవరికీ అనుమతించలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో ఏముందో మీరే చూడండి... 



Related Post

సినిమా స‌మీక్ష