మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా చేస్తున్న‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది కనుక టీజర్ వదిలారు.
“నమస్కారం అప్పా!... మాఊరు పెనుగొండ రాయలసీమ... నా పేరు కనకరాజు అంటూ పరిచయం చేసుకోవడం, ఆ తర్వాత టీజర్ అద్భుతంగా సాగింది.
సినిమా నేపధ్యం రాయలసీమ అని చెప్పేశారు కనుక ఆ మాండలికంలోనే హీరోతో సహా అందరి డైలాగులు ఉంటాయి. మరి ఇవి తెలంగాణలో ఎంతమందికి అర్ధమవుతాయి. కాకపోతే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న అపశకునంలా అనిపిస్తుంది.
చిత్తూరు యాసలో వచ్చిన ‘పుష్ప’ని ఆదరించారు. రాయలసీమ యాసలో వచ్చిన ‘లెనిన్’ని ఆదరిస్తున్నారు. కనుక సినిమాలో డైలాగ్స్ అన్ని ప్రాంతాల వారికీ అర్దమయ్యేలా బ్యాలన్స్ చేసుకొని వస్తే కనకరాజు కొరియన్ భాషలో మాట్లాడినా తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
దక్షిణ కొరియా నేపధ్యంలో హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా విభిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలిపారు.
ఈ సినిమాకు సంగీతం: తమన్; కెమెరా: మనోజ్ రెడ్డి, ఆర్ట్: పనీర్ సెల్వం చేశారు.
ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మించిన కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.