ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. వచ్చే నెల (ఆగస్ట్) 29న అగ్నివీర్ నియామకాలు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా అగ్నివీర్-టెక్నికల్, అగ్నివీర్-ట్రేడ్స్ మ్యాన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ముఖ్య గమనిక: ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో మాజీ సైనికులు, వారి సోదరులు, ప్రస్తుతం పని చేస్తున్న సైనికుల కుమారులు, యుద్ధవీరుల భార్యలు, వితంతువులు దీనిలో పాల్గొనవచ్చునని రక్షణశాఖ ప్రకటించింది.
అగ్నివీర్ టెక్నికల్:
వయో పరిమితి: 17-22 సంవత్సరాలు
విద్యార్హతలు: ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్‌తో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులై ఉండాలి. సైన్స్‌లో కనీసం శాతం మార్కులు లేదా ఐటిఐ లేదా డిప్లొమా చేసి ఉండాలి.
అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ (చెఫ్): 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్విమ్మింగ్, డైవింగ్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఓపెన్ కేటగిరీలో నియామకాలు.
రిక్రూట్మెంట్ వేదిక: సికింద్రాబాద్‌లోని 1 ట్రైనింగ్ బెటాలియన్, మిల్కాసింగ్ స్టేడియం, 1 ఈఎంఈ సెంటర్.
రిక్రూట్మెంట్ సమయం: ఆగస్ట్ 29, ఉదయం 6 గంటల నుంచి.
ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాల కోసం: ఫోన్ నం: 040-27863016 వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in