పోలీస్ ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ ఇలా..

August 21, 2026
img

ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న యువతకు ఓ ముఖ్య గమనిక. ఈ ఉద్యోగాలకు తగిన శిక్షణ (కోచింగ్)  ఉచితంగా పోలీస్ శాఖే అందిస్తోంది. కనుక ఈ ఈ ఉచిత శిక్షణ పొందాలనుకుంటే, ఈ నెల 23న పోలీస్ శాఖ నిర్వహించే రాత పరీక్షకు హాజరయ్యి అర్హత సాదించాల్సి ఉంటుంది.

దీని కోసం అభ్యర్ధులు జిల్లాలోని తమ సమీపంలో గల పోలీస్ స్టేషన్లలో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 23న ఉదయం  11 గంటలకు రాత పరీక్ష జరుగుతుంది. దీనిలో అర్హత సాధించిన వారికి జిల్లా డీటీసిలో నిపుణుల చేత శిక్షణ ఇప్పించబడుతుంది.

కనుక జిల్లాలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తి చేశారు.             

రాష్ట్రంలో మిగిలిన జిల్లాలలో కూడా పోలీస్ శాఖ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇస్తుంది. కనుక అభ్యర్ధులు తమ సమీప పోలీస్ స్టేషన్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.  

Related Post