యూపీఐ పేమెంట్ల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీ) వెనక్కు తగ్గింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) ఛార్జీలను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్లు ఎన్‌పీసీ ప్రకటించింది.
అలాగే అక్టోబర్ 15 నుంచి పర్సన్-టు-మర్చెంట్ (పి2ఎం)లో రూ.2,000 అంతకు మించి జరిగే చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వసూలు చేయాలనే ప్రతిపాదనను కూడా ఎన్‌పీసీ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై
దసరా, దీపావళి పండుగల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. కనుక కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వ్యాపార సంఘాల ప్రతినిధుల సమావేశంలో వారి విజ్ఞప్తి మేరకు ఛార్జీల అమలును వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలో తుది నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని ఎన్‌పీసీ తెలిపింది.