ఆ డైరెక్టర్ కమిట్‌మెంట్ అడిగారు: నీతి టేలర్!

October 13, 2026


img

సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే నటీమణులకు ఎదురవుతున్న వేధింపులపై నటి నీతి టేలర్ చేసిన తాజా వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నా కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడుతో ఓ సినిమా చేశాను. ఓ రోజు అతనే నాకు ఫోన్ చేసి మరో సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. అయితే ఈసారి నాతో పడుకొంటేనే లేకుంటే లేదని చెప్పాడు. అది విని నేను షాక్ అయ్యాను.

సినిమా సెట్స్‌లో అతను ఇతర అమ్మాయిలతో అసభ్యంగా వ్యవహరించడం నేను చూశాను. అంత వయసున్న ఆ దర్శకుడు అలా ప్రవర్తిస్తున్నాడేమిటి? అని అనుకునేదాన్ని కానీ నన్ను కూడా ఇలా అడుగుతాడని నేను అనుకోలేదు.

వెంటనే నేను అతని ఫోన్ కట్ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్ చేశాను. ఆ తర్వాత మా అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పుకొని చాలాసేపు ఏడ్చాను. అప్పటి నుంచే ఇక దక్షిణాది సినిమాలలో నటించడం మానుకున్నాను,” అని నీతి టేలర్ చెప్పారు. 

అటువంటి కోర్కె కోరిన ఆ దర్శకుడు పేరు ఆమె బయటపెట్టలేదు. కానీ ఆమె నటించిన మొదటి తెలుగు చిత్రం ‘మేం వయసుకు వచ్చాం.’ త్రినాథరావు నక్కిన ఆ సినిమా దర్శకుడు. అతనే రెండో సినిమా ఆఫర్ కూడా ఇచ్చాడని నీతి టేలర్ చెప్పారు. కనుక ఆమెను ఆ కోర్కె కోరిన వ్యక్తి అతనే అని చెప్పకనే చెప్పారు. 


Related Post

సినిమా స‌మీక్ష