సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న ‘భరత వర్ష’ నుంచి తొలి పాట ఈ నెల 14న సాయంత్రం విడుదల కాబోతోంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ సినిమా నుంచి ‘అమ్మ కదిలి వచ్చే..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ పీరియాడికల్ మూవీలో గోపీ చంద్‌కు జోడీగా రీతూవర్మ నటిస్తున్నారు. వినోద్ కుమార్, గావీ చాహల్, తణికెళ్ల భరణి, రాకేష్ వర్రే, భారత్ రెడ్డి, ఛత్రపతి శేఖర్, రవి వర్మ, కిషోర్, కార్తికేయ, మధుమణి, బేబీ తేజల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
మొదట బడ్జెట్ 30 కోట్లనుకొని ఈ సినిమా మొదలు పెట్టారు. కానీ అది 70 కోట్లు దాటిపోయినట్లు తెలుస్తోంది. కనుక గోపీచంద్ కెరీర్‌లో ఇదే తొలి భారీ బడ్జెట్ సినిమాగా నిలువబోతోంది.
భరత వర్షకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: సంకల్ప్ రెడ్డి, పాటలు: చంద్రబోస్, కళ్యాణ్ చక్రవర్తి
సంగీతం: అనుదీప్ దేవ్, కెమెరా: సౌందర్ రాజన్ ఎస్, స్టంట్స్: వెంకట్, పృధ్వి, రియల్ సతీష్, రాజేష్ లంకా, వెంకటరావు, ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ చేస్తున్నారు.
సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.