భోగి నుంచి ఫస్ట్ సింగిల్... ఆహా ఎంత అద్భుతంగా ఉంది!

October 09, 2026


img

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘భోగి’ సినిమా నుంచి మొదటి పాట శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు విడుదలైంది. ఎగిలి వారంగా అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌కు చంద్రబోస్ గ్రామీణ జీవితాన్ని, వివిధ కులవృత్తులను చక్కటి చిన్న చిన్న పదాలతో అద్భుతంగా వ్రాశారు. 

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా నల్గొండ గద్దర్ నర్సన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ కలిసి ఈ పాటకు తమ గొంతుతో ప్రాణం పోశారు. గ్రామీణ జీవితాన్ని వర్ణిస్తూ చాలా సినిమాలలో చాలా చక్కటి పాటలు వచ్చాయి. ఆ జాబితాలో ఇప్పుడు ఈ పాట కూడా చేరుతుంది.

పాట చివర్లో ఊర్లోని పటేల్ నిరంకుశ తీరును సూచిస్తున్నట్లు, గడీ ఆవరణలో ఓ సింహాసనం, అతని కోసం తయారుచేసిన చెప్పులను నెత్తిన పెట్టి తీసుకురావడం, వాటిని బల్లపై పెట్టి గ్రామస్తులు పండించిన పళ్ళు, కూరగాయలు, తయారు చేసిన వస్తువులు సమర్పించుకోవడం చూపడం అందరినీ ఈ సినిమా కథలోకి తీసుకువెళుతుంది.        

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కందుల సులోచనా రాణి అఅనే గిరిజన మహిళగా నటిస్తోంది. 1960లో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు, పోరాటాల నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 12న విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/OnJePBouURU?si=m4OkjHwnxFJeBBo-" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష