రెండు వారాల ముందుగా క్రేజీ కల్యాణం రిలీజ్‌

October 07, 2026


img

అనుపమ పరమేశ్వరన్‌, తరుణ్ భాస్కర్‌ భాస్కర్ ప్రధానపాత్రలు చేస్తున్న ‘క్రేజీ కల్యాణం’ ఈ నెల 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ హటాత్తుగా త్రివిక్రమ్‌-వెంకటేష్‌ సినిమా ఆదర్శ కుటుంబం అక్టోబర్‌ 9న కూడా విడుదల చేయలేమని స్పష్టం చేయడం, ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నట్లు తమన్ హింట్ ఇవ్వడంతో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రేజీ కల్యాణం టీమ్‌ నిర్ణయించుకుంది. కనుక అక్టోబర్‌ 16న అంటే రెండు వారాల ముందుగా సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.     

ఈ సినిమాలో వికె నరేష్, అఖిల్ ఉద్దెమారి ముఖ్యపాత్రలు చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, దర్శకత్వం: బద్రప్ప గజుల, సాహిత్యం: గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, దినేష్ కక్కెర్ల, సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దుపాటి, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని, యాక్షన్: డ్రాగన్ ప్రకాశ్ చేశారు. 

యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. 



Related Post

సినిమా స‌మీక్ష