హీరో ధనుష్‌ కూడా కొత్త పార్టీ ఏర్పాటు?

October 07, 2026


img

కోలీవుడ్‌ నటులు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకోవడం కొత్తేమీ కాదు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, కోలీవుడ్‌తో సంబంధం ఉన్న కరుణానిధి వంటివారు ముఖ్యమంత్రులయ్యారు. తాజాగా విజయ్‌ దళపతి టీవీకే పార్టీ ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. వారి స్పూర్తితో రజనీకాంత్ కూడా పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆయన సాటి నటుడు కమల్ హాసన్ కూడా సొంత పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించారు. ఆయనను ఎంతగానో అభిమానించే తమిళ ప్రజలు ఎందుకో అయనని పట్టించుకోలేదు.   

తాజాగా హీరో ధనుష్‌ కూడా కొత్త పార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేసుకున్తున్నారు. తమిళగ ఎళుచ్చి కళగం’ అనే పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అయన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.


Related Post