అక్టోబర్‌ 10 నుంచి బతుకమ్మ వేడుకలు

October 04, 2026
img

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఈ నెల 10 నుంచి మొదలయ్యి 18వ తేదీ వరకు జరుగుతాయి. ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లు, సంబందిత శాఖల అధికారులతో ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు.

మొదటి రోజు: అక్టోబర్ 10 (శనివారం): ఎంగిలిపూల బతుకమ్మ

రెండవ రోజు: అక్టోబర్ 11 (ఆదివారం): అటుకుల బతుకమ్మ

మూడవ రోజు: అక్టోబర్ 12 (సోమవారం):ముద్దపప్పు బతుకమ్మ

నాల్గవ రోజు:అక్టోబర్ 13 (మంగళవారం:):నానే బియ్యం బతుకమ్మ

ఐదవ రోజు: అక్టోబర్ 14 (బుధవారం):అట్ల బతుకమ్మ

ఆరవ రోజు: అక్టోబర్ 15 (గురువారం): అలిగిన బతుకమ్మ

ఏడవ రోజు: అక్టోబర్ 16 (శుక్రవారం): వేపకాయల బతుకమ్మ

ఎనిమిదవ రోజు: అక్టోబర్ 17 (శనివారం):వెన్నముద్దల బతుకమ్మ

తొమ్మిదవ రోజు: అక్టోబర్ 18 (ఆదివారం):సద్దుల బతుకమ్మ / పెద్ద బతుకమ్మ

ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రం నుంచి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు కళాకారులు కూడా పాల్గొని వివిధ కళారూపాలను ప్రదర్శించనున్నారు. ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలతో తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. 

నగరంలో ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని సూచించారు. వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా, భద్రత, ఇతర అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు.

Related Post