ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేసిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనతో గట్టెక్కింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 9వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
సితారా ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్; ఆర్ట్: ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి;ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.
క్లుప్తంగా ఈ సినిమా కథ: 90వ దశకంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. సినిమా దర్శకుడు కావాలనుకుంటాడు. లండన్ వెళ్తే అక్కడ హీరోయిన్‌తో పరిచయం, ప్రేమ, సహజీవనం. ఈ నేపధ్యంలో అప్పటి జనరేషన్ ఆలోచనలు, కోర్కెలు, సమస్యలు చూపిస్తూ సినిమా నడిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఓటీటీలో చూసి తెలుసుకుంటే బాగుంటుంది.