ఆదర్శ కుటుంబం రిలీజ్‌ మరోసారి వాయిదా!

October 06, 2026


img

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌ ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నం: 47’ అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన అక్టోబర్ 9కి వాయిదా పడింది. కానీ ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోజు కూడా విడుదల చేయలేమని మరికాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు.

ప్రస్తుతం వెంకటేష్‌ విదేశీ పర్యటనలో ఉన్నారని తిరిగి రాగానే అయనతో మాట్లాడి రిలీజ్‌ డేట్ ప్రకటిస్తామని చెప్పారు.

అక్టోబర్ 9న విడుదల చేయగలమనే నమ్మకంతోనే ఓవర్సీస్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవడంతో సినిమా వాయిదా వేయక తప్పలేదు. ఈ విషయం ముందే మేము ప్రకటించి ఉండి ఉంటే, వేరే సినిమాలు ఆ రోజు విడుదల చేసుకునేవారు. మా వలన వారికీ ఇబ్బంది కలిగింది. అందుకు వారికీ, సినిమా వాయిదా వేసినందుకు ప్రేక్షకులకు క్షమాపణలు. ఆదర్శ కుటుంబం కాస్త ఆలస్యమైనా ప్రేక్షకులను నిరాశపరచాదని మాత్రం చెప్పగలను,” అని అన్నారు.      

ఈ సినిమాలో వెంకటేష్‌ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటిస్తున్నారు. రావు రమేష్,  బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్‌బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్‌; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేశారు. 

క్రైమ్-ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష