భోగి టీజర్‌.. శర్వానంద్‌ విశ్వరూపమే

October 04, 2026


img

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చేసిన్న ‘భోగి’ సినిమా టీజర్‌ నేడు విడుదలైంది. గ్రామాలలో అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు నేపధ్యంతో ఈ సినిమాని తెరకెక్కించారు. కనుక టీజర్‌లో రక్తపాతం బాగానే జరిగింది. అయితే ఇటీవల వరుసగా ఇలాంటి కథలతో అనేక సినిమాలు వస్తున్నాయి. కనుక ‘భోగీ’తో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించగలరో చూడాలి.    

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కూరగాయలు అమ్ముకునే కందుల సులోచనా రాణిగా నటిస్తున్నారు.  డింపుల్ హయతి, అవినాష్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: సంపత్ నంది, పాటలు: చంద్రబోస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎ కిషోర్ కుమార్‌, స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నె చేస్తున్నారు. 

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 12న విడుదల చేయబోతున్నట్లు టీజర్‌లో ప్రకటించారు. 


Related Post

సినిమా స‌మీక్ష