హర్ష చెముడు, హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇటీవల విడుదలైన టీజర్‌లో కామెడీ అద్భుతంగా ఉందనుకుంటే నేడు విడుదలైన ట్రైలర్‌లో కామెడీ ఇంకా అదిరింది.
ఈ నెల 9న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్‌లో జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, రూప శ్రావ్య, శ్రీ విద్య, ప్రేమ్ సాగర్, వాసు ఇంటూరి, మహేందర్, జబర్దస్త్ గోపీ తదితరులు నటించారు.
‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు కథ, దర్శకత్వం: బాబు డేగల, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజయ్ అర్సాడ, సినిమాటోగ్రఫీ: శక్తి అరవింద్, ఎడిటింగ్: లిఖిత్ లీ చేశారు.
ఈటీవీ విన్ కోసం చావన్, శ్రీధర్ చేని, దీపక్ ముస్త్యాల కలిసి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు.