తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ‘క్రేజీ కల్యాణం’ నుంచి అలసెంద్రవంక లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. జానపద ఛాయలతో వినసొంపైన బాణీతో వచ్చిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
జి. వెంకన్న వ్రాసిన ఈ పాటను సురేష్ బొబ్బిలి అద్భుతంగా స్వరపరిచి సంగీతం అందించగా, అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ఈ పాటకు జీవం పోశారు.
పాటకు తగ్గ విజువల్స్ కూడా సహజమైన పల్లె నేపథ్యాన్ని చూపిస్తూ ప్రేమ పరిమళాలు మనసులను తాకేలా ‘అలసెంద్రవంక’ పాట ప్రేక్షకులకు ఈ సినిమా తప్పక చూడాలనే ఆసక్తి కలిగించేలా ఉంది. ఈ సినిమాలో నరేష్, అఖిల్ రాజ్ ఉద్దమరి, కిరీటి తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: బద్రప్ప గాజుల, సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ: శ్యామ్ దుపాటి, ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని చేస్తున్నారు.
బూసం జగన్ రెడ్డి సొంత బ్యానర్‌పై యారోస్ సినిమాస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.