దివంగత ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా ఆయన మనుమడు అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఓ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. ‘ఐకాన్‌జా’ అనే పేరుతో ఏర్పాటు చేసుకున్న తన కొత్త కార్యాలయం గురించి ఏమన్నారంటే, ‘కొత్త కార్యాలయం.. కొత్త ఆరంభం.. కొత్త అధ్యాయం’ అని పేర్కొన్నారు.
కార్యాలయంలో అల్లు రామలింగయ్య విగ్రహానికి ఇరు వైపులా అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్ వారి కుటుంబ సభ్యులు నిలబడి ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్నారు. సుకుమార్‌తో పుష్ప-3, కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో సినిమాలు చేయబోతున్నారు. ఈ రెండూ పూర్తవక మునుపే ప్రముఖ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వీటి మధ్యలోనో లేక ఇవన్నీ పూర్తయిన తర్వాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్,తొలిసారిగా ఓ పౌరాణిక సినిమా చేయబోతున్నారు. ఈ విషయం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కనుక అల్లు అర్జున్ మరో రెండు మూడేళ్ళ వరకు వరుసగా సినిమాలు చేయబోతున్నారన్న మాట!
అల్లు రామలింగయ్య హాస్య నటుడుగా పరిచయం అవసరం లేని గొప్ప నటుడు. ఆయన స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొన్న సమర యోధుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు. సినిమాలలో రాక మునుపు అయన హోమియోపతీ వైద్యం చేసేవారు.
అల్లు రామలింగయ్య 1953 నుంచి 2004 వరకు సుమారు వెయ్యికి పైగా సినిమాలలో నటించారు. పద్మశ్రీతో సహా అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారు.
ICONZA
A new office. A new beginning.
On the birth anniversary of my grandfather, Allu Ramalingaiah garu.
The start of a new chapter. 🖤#ICONZA #ARG pic.twitter.com/vK9KyvVrso