తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. కొత్త రేట్లు ఇవే

October 02, 2026
img

తెలంగాణలో ఆటో ప్రయాణం ఇకపై మరింత ఖరీదుకానుంది. ఆటో రిక్షాల కనీస ఛార్జీతో పాటు కిలోమీటర్‌ ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు రవాణా శాఖ జీవో నంబర్‌: 46 జారీ చేసింది.

దాని ప్రకారం ఆటోలో తొలి 1.6 కిలోమీటర్లకు కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కి.మీ.కు రూ.14 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆటో ప్రయాణంలో వేచి ఉండే సమయానికీ నిమిషానికి 75 పైసలు చొప్పున వెయిటింగ్‌ ఛార్జీ నిర్ణయించారు. 

రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి అదనపు ఛార్జీ ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు వసూలు చేయనున్నారు.

అయితే కిలోమీటర్ల లెక్కన ఈ ఛార్జీలు నిర్ణయించినందున, ఆటో మీటర్లను కొత్త రేట్లకు అనుగుణంగా సవరించుకునేందుకు డ్రైవర్లకు మూడు నెలలు గడువు ఇచ్చారు. 

2012 తర్వాత ఆటో ఛార్జీలను తొలిసారిగా సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కొత్త రేట్లు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఆటో డ్రైవర్ల సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఛార్జీల పెంపుపై అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే.

Related Post