ఆర్టీసీ, మెట్రోప్రయాణాలకు ఒకటే పాస్‌.. ధరలు ఇవే

October 02, 2026
img

RTC–Metro Joint Pass Launched in Hyderabad

హైదరాబాద్‌ నగరవాసులకు ఓ శుభవార్త! ఇక నుంచి ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు వేర్వేరుగా టికెట్లు, పాసులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉమ్మడి పాస్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. 

ప్రజా భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ పాస్‌ను ప్రారంభించారు. ఈ ఉమ్మడి రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8,500గా నిర్ణయించారు. రోజువారీ పాస్‌తో ఒక రోజు, నెలవారీ పాస్‌తో 30 రోజుల పాటు అపరిమితంగా మెట్రో, సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

ప్రతీరోజూ ఆర్టీసీ బస్సులు, మెట్రోలో ప్రయాణించే నగరవాసులకు ఈ ఉమ్మడి పాస్‌ చాలా సౌలభ్యంగా ఉంటుంది. బస్,, మెట్రో పాసుల కోసం వేర్వేరుగా డబ్బులు చెల్లించడం, వాటి కోసం క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండా దీనిని ఆన్‌లైన్‌లో కూడా రెన్యువల్ చేసుకోవచ్చు. 

రోజువారీ పాసులపై రాబడిలో ఒక్కో పాసుపై రూ.300 మెట్రోకు, రూ.100 ఆర్టీసీకి వెళుతుంది. అదేవిధంగా నెలవారీ పాసుల రాబడిలో మెట్రోకు రూ.7,000, ఆర్టీసీకి రూ.1,500 చొప్పున వెళుతుంది.  

హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థల మధ్య సమన్వయాన్ని పెంచి, తద్వారా నగర ప్రజలకు మరింత సౌలభ్యం అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

Related Post