మనం మరిచిన మన వీరుల కథే రణబాలి

October 02, 2026


img

విజయ్ దేవరకొండ, రష్మిక భార్యాభర్తలు నటించిన చిత్రం రణబాలి. ఈ సినిమా నుంచి ట్రూత్-3, మనం మరిచిపోయిన మనుషులు అంటూ నాడు బ్రిటిష్ వారిని ఎదిరించిన రాయలసీమకు చెందిన పలువురిని దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ పరిచయం చేశారు. వారి స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు.    

1876-78 సంవత్సరాల మధ్య కాలంలో రాయలసీమలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ జరిగిన స్వాతంత్ర్య పోరాటాలతో నేపధ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా దక్షిణాఫ్రిక నటుడు ఆర్నాల్డ్ వస్లూ నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ: ప్రమోద్ తమ్మినేని, సంగీతం: అజయ్-అతుల్, కెమెరా: నీరవ్ షా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్‌, ఆర్ట్: వితల్ కొసనం, స్టంట్స్: యానిక్ బెన్, అండీ లాంగ్ గుయెన్, రాబిన్ సుబ్బు చేస్తున్నారు.  

గుల్షన్ కుమార్‌, భూషణ్ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి నిర్మిస్తున్న రణబాలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష