ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసినందున మళ్ళీ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన హడావుడే ఎక్కువగా ఉంది.
తన నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఓట్లు తొలగించారని దానం ఆరోపించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు వెనుక బిజేపి,,కేంద్ర ఎన్నికల కమీషన్ అధికారుల ప్రమేయం ఉందని భావిస్తున్నానని అన్నారు. కనుక తక్షణమే తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరారు.
కేంద్ర ఎన్నికల కమీషన్ తక్షణం స్పందించి, ఓట్ల తొలగింపుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘం తీరు మార్చుకోకపోతే లేకుంటే ఎన్నికల సంఘం తగలబడి పోతుందని హెచ్చరించారు.
ఆయనపై అనర్హత వేటు పది ఎన్నికలలో పోటీ చేయలేని పరిస్థితిలో ఉంటూ ఎన్నికల సంఘం తగలబడిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పుడే సోషల్ మీడియాలో చర్చ, విమర్శలు మొదలయ్యాయి.
మరో పక్క ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ చేపట్టాల్సిన అవసరం లేదని, మళ్ళీ పిటిషన్ వేస్తే త్వరలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది.