‘బాబా బ్లాక్‌ షీప్‌’ ట్రైలర్‌ విడుదల..

October 03, 2026


img

కామెడీ జోనర్‌లో రూపొందించిన ‘బాబా బ్లాక్‌ షీప్‌’ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. ట్రైలర్‌ చూస్తే అక్టోబర్‌ 9న విడుదల కాబోతున్న ఈ సినిమాని తప్పక చూడాలనిపించేలా ఉంది. 

ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, అక్షయ్‌ లగుసాని, విష్ణు ఓయ్‌, జార్జ్‌ మరియన్‌, తిన్ను ఆనంద్‌, కశ్యప్‌, కార్తికేయ దేవ్‌, సమృద్ధి ఆర్యల్‌, మాల్వీ మల్హోత్రా, విస్మయ శ్రీ, రాజా రవీంద్ర తదితరులు నటించారు. 

గుని మంచికంటి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో విడుదలకు సిద్దమైన ఈ సినిమాకు సంగీతం: ఎలక్ట్రానిక్‌ కిలి, సినిమాటోగ్రఫీ: అజయ్‌ అబ్రహం జార్జ్‌; నృత్య దర్శకత్వం: జేడీ మాస్టర్‌; స్టంట్స్‌: వింగ్‌చున్‌ అంజి; ఎడిటింగ్‌: విజయ్‌ ముత్తవరపు చేశారు.

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 9న విడుదల కాబోతోంది.

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/QQQZDiV7L-k?si=vwU3BHMnp3cHOkYR" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష