కామ్రేడ్ కళ్యాణ్... టైటిల్‌ సాంగ్‌ కామెడీ కాదు

October 03, 2026


img

జానకీ రామ్‌ మారెళ్ళ దర్శకత్వంలో శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ నుంచి టైటిల్‌ సాంగ్‌ నేడు విడుదలైంది. 

 భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్‌గనిన్ స్వరపరిచి సంగీతం అందించగా రాహుల్ సిప్లీగంజ్ అద్భుతంగా పాడారు. 

ఈ సినిమాలో మోస్ట్ వాంటడ్‌ మావోయిస్టుగా శ్రీవిష్ణు నటించారు. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్‌, షైన్ టాం చాకో, ఉప్రేంద్ర లిమాయే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

 ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్‌ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేశారు.            

స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష