మొహబ్బత్‌ టీజర్‌.. రాయలసీమలో ఓ ప్రేమకథ

October 04, 2026


img

‘మొహబ్బత్‌’ పేరుతోనే ఇది ప్రేమకథా చిత్రమని అర్ధమవుతోంది. కానీ ఇదొక రాయలసీమ ప్రేమకథ. సీమలో రక్తపాతమే కంటే తీవ్రమైన ప్రేమ, భావోద్వేగాలు ఉంటాయంటూ సీమ యాసలో నటుడు అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్‌తో విడుదలైన మొహబత్ టీజర్‌ చాలా ఆకట్టుకుంటుంది.    

ఎంఏకే దర్శకత్వంలో సంతోష్‌రాజ్‌, శ్రేయాసి సేన్‌ జంటగా చేస్తున్న ఈ సినిమాలో  అజయ్‌ ఘోష్‌, అఫ్రోజ్‌ షేక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి కథ: ఎం.డి.కలాం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ఎంఏకే, పాటలు: కేభాష్యశ్రీ, ఎం.డి. కలాం, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, కెమెరా: వై.ఎస్‌.కృష్ణ, డాన్స్ కోరియోగ్రఫీ: మోయిన్‌, ఎంఏకే, స్టంట్స్: ఝాషువా, ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్‌ చేస్తున్నారు.

ఎబీఎస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ‘మొహబ్బత్‌’ త్వరలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష