ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు

October 04, 2026


img

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (94) ఈరోజు ఉదయం చెన్నైలోని కావేరి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూనే ‘‘సింగ్ గీతం’ అనే చక్కటి సినిమాకు దర్శకత్వం వహించారు. 

ఇంత వయసులో  అటువంటి పరిస్థితిలో కూడా సినిమాల పట్ల అయనకున్న ప్రేమ, అభిరుచి, ముఖ్యంగా సృజనాత్మక ఆలోచనలు అందరికీ స్పూర్తిదాయకమే. ప్రకృతిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అనే చక్కటి సందేశంతో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘సింగ్ గీతం’ జూన్‌లో విడుదలై సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కృష్ణంరాజు, కాంచన జంటగా నటించిన ‘నీతి నిజాయితీ’ సినిమాతో సింగీతం 1972లో సినీ పరిశ్రమలో ప్రవేశించారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ తదితర పలు భాషలో 60కి పైగా సినిమాలు చేశారు. 

తెలుగులో అయన చేసిన  జమీందారు గారి అమ్మాయి, అమెరికా అమ్మాయి, పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, అమావాస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు, మయూరీ, ఆడవాళ్ళకు మాత్రమే, మేడమ్, భైరవ ద్వీపం వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. 

అలాగే నందమూరి బాలకృష్ణతో చేసిన ఆదిత్య 369, కమల్ హాసన్‌తో చేసిన పుష్పక విమానం, విచిత్ర సోదరులు వంటి ప్రయోగాలు చేసి అందరినీ మెప్పించారు. నేటికీ చాలా మంది ఆ సినిమాల గురించి చెప్పుకుంటూనే ఉంటారు. ప్రతీ సినిమా పూర్తి భిన్నమైన కథ, కాన్సెప్ట్ లతో తీసిన చిత్రాలే. చివరిగా ‘సింగ్ గీతం’తో అటువంటి ప్రయోగమే చేశారు.    

సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. 


Related Post

సినిమా స‌మీక్ష