మెగాస్టార్ ‘కాకా’ రిలీజ్‌ సంక్రాంతికే

November 29, 2026


img

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘కాక’ విడుదలపై వస్తున్న ఊహాగానాలకు చిత్రబృందం ఒక్క అప్‌డేట్‌తో చెక్ పెట్టింది. 2027, సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ఏషియన్ సినిమాస్ దక్కించుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో జనవరి 13న ‘కాక’ విడుదల ఖాయమని స్పష్టం చేసినట్లయింది. 

బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ వైద్య విద్యార్ధిని ‘అమ్ములు’ అనే పాత్ర చేస్తున్నారు. నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్,  ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్ చేస్తున్నారు. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాక’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష