ప్రభుదేవా, ప్రధాన పాత్ర చేసిన మూన్‌వాక్ సినిమా ట్రైలర్ విడుదలైంది. మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ ప్రభుదేవాతో కలిసి ‘మూన్‌వాక్’ చేస్తున్నారు.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడమే కాకుండా 5 పాటలు పాడారు. మరో విశేషమేమిటంటే ఏఆర్ రెహమాన్ తొలిసారిగా ఈ సినిమాలో నటుడిగా తెరపై కనిపించబోతున్నారు. నేడు విడుదల చేసిన ‘మూన్‌వాక్’ ట్రైలర్‌లో ఆయన కనిపించారు.
ఈ సినిమాలో యోగిబాబు 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అజు వర్గీస్, అర్జున్ అశోకన్, సతీష్, నిష్మా చెంగప్ప, సుష్మిత నాయర్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మనోజ్ ఎన్.ఎస్. దర్శకత్వంలో మ్యూజిక్, డాన్స్, కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను బిహైండ్ వుడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మనోజ్ ఎన్.ఎస్., దివ్య మనోజ్, ప్రవీణ్ ఎలాక్ కలిసి తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. అందరూ కలిసి డిసెంబర్ 24న ‘మూన్‌వాక్’ చేయబోతున్నారు.