కొరియోగ్రాఫర్ నుంచి నటుడుగా మారి ప్రేక్షకులను మెప్పించిన ప్రభుదేవా ‘మూన్‌వాక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 27న సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోందని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'జెంటిల్మెన్', 'కాదలన్', 'మిస్టర్ రోమియో', 'లవ్ బర్డ్స్' వంటి సినిమాలతో ప్రభుదేవా, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ వారిద్దరూ కలిసి ఈ ‘మూన్‌వాక్’ చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇన్ని దశాబ్దాలు సంగీత దర్శకుడు, గాయకుడుగా అలరించిన ఏఆర్ రెహమాన్ తొలిసారిగా ఈ సినిమాలో నటుడిగా తెరపై కనిపించబోతుండటం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతో పాటు ఐదు పాటలు కూడా పాడారు.
మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో యోగిబాబు 16 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అజు వర్గీస్, అర్జున్ అశోకన్, సతీష్, నిష్మా చెంగప్ప, సుష్మిత నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
మ్యూజిక్, డాన్స్, కామెడీ ప్రధానంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించారు. మనోజ్ ఎన్.ఎస్. దర్శకత్వంలో బిహైండ్‌వుడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మనోజ్ ఎన్.ఎస్., దివ్య మనోజ్, ప్రవీణ్ ఎలాక్ కలిసి ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ‘మూన్‌వాక్’ డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.