టీఆర్ఎస్‌ పార్టీలో మరో టీఆర్ఎస్‌ తెలంగాణ రుద్రమ సేన

November 26, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు పెట్టారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు పోస్టర్‌ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆమె మహిళలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు సత్తా చాటాలి. మన పార్టీ కోసం పనిచేసే మహిళలకు రాజకీయాల్లో తగిన అవకాశాలు కల్పించే బాధ్యత నాదే. ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా మహిళలు ఎదిగేందుకు అన్ని విధాల నేను అండగా ఉంటాను. మహిళలు తమ కుటుంబ జీవనం సాగిస్తూనే సమాజం కోసం పని చేయాలి. అందుకు టీఆర్ఎస్‌ పార్టీలోని ఈ రుద్రమసేన అందుబాటులో ఉంది. 

పేదలు, మహిళల కోసం పనిచేస్తాయని భావించే కమ్యూనిస్టు పార్టీల్లో కూడా మహిళలకు సమస్యలు తప్పడం లేదు. ఇతర పార్టీలలో సరే సరి. ముఖ్యంగా  రాజకీయాల్లో ఉన్న మహిళల పట్ల సోషల్ మీడియాలో చాలా అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధింపులకు గురవుతున్నారు.

రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించినప్పటికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనుక మహిళలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తే వారు మరింతగా రాణించగలరని నేను భావిస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 


Related Post