వృషకర్మ ట్రైలర్‌... చూశారా?

November 26, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన సోషియో ఫ్యాంటసీ సినిమా ‘వృషకర్మ.’  ఈ సినిమా ట్రైలర్‌ బుధవారం సాయంత్రం నెల్లూరులో విడుదల కావాల్సి ఉండగా సాకేంతిక సమస్య వలన కుదరలేదు. కనుక గురువారం ఉదయం సోషల్ మీడియాలో ‘వృషకర్మ’ ట్రైలర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ (‘లాఫతా లేడీస్) ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది.   


Related Post

సినిమా స‌మీక్ష