అతనొక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఉన్నంతలో హాయిగా జీవితం సాగిపోతోంది. కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలో మరొకటో కారణం కాదు. షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్, నివసిస్తున్న ఆ 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉన్నందంతా ఊడ్చిపెట్టి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాడు. కానీ రూ.35 లక్షలు నష్టపోయాడు. దీంతో తీవ్ర ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయాడు. ఎంతగా ప్రయత్నించిన వాటి నుంచి బయటపడలేక ఆ బాధలు భరించలేక అతను చైతన్యపురిలో తను ఉంటున్న అపార్ట్‌మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని ఇంట్లో లభించిన సూసైడ్ లెటర్‌లో షేర్ మార్కెట్‌లో భారీగా నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.