సుధర్శన్ గోవింద్, ఆరుషి ప్రధాన పాత్రలు చేస్తున్న సినిమా పేరు ‘బీ ఏ మ్యాన్.’ ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ నేడు విడుదలైంది. ‘కోపం వస్తే గట్టిగా అరువు. బాధ కలిగితే ఏడ్వు. కానీ ఒక్క నిమిషం... సమాజం ఏమనుకుంటుంది?’ అనే ఆలోచింపజేసే క్యాప్షన్ యాడ్ చేశారు.. పోస్టర్‌కి.
ఈ సినిమాలో సుమన్, అనీష్ కురువిల్లా, ప్రదీప్ రుద్ర, కమల్ తుము, జై ప్రవీణ్, షెల్లీ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: పవన్ కుమార్ బైకాటి, చందు అనమన్సాయి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. జాయ్ సోల్మన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అష్కర్, ప్రొడక్షన్ డిజైన్: కె. కుమార్ మన్నె, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, స్నేహ, ప్రేమ్ భగత్ చేస్తున్నారు.
ది బాయ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లిఖిత రెడ్డి, కార్తీక్ రెడ్డి బైకటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.