అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ‘రాకా’కు సంబంధించి ఓ కొత్త విషయం వినిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ‘రాకా’లో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ వార్తను ‘రాకా’ టీమ్ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమాలో గోవింద నటిస్తున్నట్లయితే ఇదే ఆయనకు తొలి దక్షిణాది సినిమా అవుతుంది.
ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా బాలీవుడ్ సీనియర్ నటి దీపికా పదుకొణె నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ‘రాకా’లో గోవిందతో సహా మిగిలిన నటీనటుల పేర్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
వచ్చేనెలలో ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కనుక దాని కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సుమారు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో 9 భారతీయ భాషల్లో రాకా నిర్మిస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ‘రాకా’ విడుదల కాబోతోంది.