అలియాస్ రుక్మిణి.. ట్రైలర్‌ చూశారా?

November 27, 2026


img

నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటించిన ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

ఈ సినిమాలో రచయిత కృష్ణగా నటిస్తున్న నితిన్‌, టీచర్‌గా నటిస్తున్న రుక్మిణి (ఆఫియా సయ్యద్ )తో ప్రేమలో పడతాడు. ఆమె పేరుతో శృంగార నవలలు రాస్తుంటాడు. పెళ్ళి తర్వాత ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి ఏవిధంగా రియాక్ట్ అయ్యింది? అనేది ట్రైలర్‌లో చూపారు. అలియాస్ రుక్మిణి పూర్తి కథ తెలియాలంటే డిసెంబర్ 4న థియేటర్లలో విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం రూపొందిన ఈ సినిమాలో సాయి కుమార్‌, హర్ష్ రోషన్‌ వర్ధన్ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కెమెరా: జోమోన్‌ టీ.జాన్‌, ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి చేశారు. 

నటుడు నాని సమర్పణలో దీప్తి గంటా యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై అలియాస్ రుక్మిణి నిర్మించారు.  


Related Post

సినిమా స‌మీక్ష