ప్రతివారం ఓటీటీలలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్ వస్తూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి పెద్ద సినిమాలు లేదా సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు ఆ కిక్కే వేరు. ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు అలాంటి కిక్కే లభించబోతోంది.
నేడు (శుక్రవారం) ఒక్కరోజే 8 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం.’ నేటి నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది.
సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమాకు హిందీలో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం 3’ తీశారు. అది నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఉత్తరాంధ్రా జిల్లాల్లో ప్రముఖ బుర్రకథ కళాకారిణి ‘రెడ్డి విజయలక్ష్మి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'గరివిడి లక్ష్మి' అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
ఉత్తరది రాష్ట్రాల ప్రజలను అలరించిన ‘హనుమాన్ అంశ్’ నేటి నుంచే సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆహాలో ‘రాతిరి’, సన్ నెక్స్ట్‌లో ‘ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్’ తెలుగు డబ్బింగ్ సినిమాలు ప్రసారం అవుతున్నాయి.
ఇక ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది చైల్డ్, ‘ది హంచ్‌బ్యాక్: సోల్ ఆఫ్ పారిస్’, ‘టైసన్ ఫ్యూరీ’ డాక్యుమెంటరీలు వచ్చాయి.
జియో హాట్‌స్టార్‌లో ‘దాయి చాల్' హిందీ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.