తమిళ హాస్యనటుడు సంతానం ప్రధాన పాత్ర చేస్తున్న తాజా చిత్రం ‘లవ్ బైట్.’ సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ డిసెంబర్ 18న విడుదల కాబోతోందని ప్రకటిస్తూ వేసిన పోస్టర్ హాయిగా నవ్వుకునేలా ఉంది. దానికి ‘జోంబీ కాటు వేయడానికి సిద్ధంగా ఉందంటూ’ క్యాప్షన్ జత చేశారు.
సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సంతానం, అపర్ణ దాస్ జంటగా నటించగా ఆనంద్‌రాజ్, వీటీవీ గణేష్, మొట్టై రాజేంద్రన్, రెడిన్ కింగ్స్‌లీ, ముత్తుకుమార్, ఆదిత్య కదిర్, నిరోషా ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, అతీంద్రియ శక్తులు, జోంబీల మధ్య గందరగోళ పరిస్థితులు సృష్టించడం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ కలిసి నిర్మించిన ఈ సినిమా తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాకు కథ, దర్శకత్వం: సెల్విన్ రాజ్ జేవియర్, సంగీతం: ఫాక్స్‌ఎన్, సినిమాటోగ్రఫీ: ఎస్.యువ, ఎడిటింగ్: ప్రదీప్ ఈ. రాఘవ్ చేశారు.