వినసొంపుగా ఉల్లిపూల లిరికల్...

November 28, 2026


img

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా చేసిన ‘ఇడుపు కాయితం’ నుంచి విడుదలైన మూడు పాటలు చాలా బాగున్నాయి. నేడు విడుదలైన ‘ఉల్లిపూల సీరే గట్టి ఉత్తరాది సెరువే దాటి ’ అంటూ హుషారుగా సాగే ఈ నాలుగో పాట కూడా వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. 

అభినయ శ్రీనివాస్ వ్రాసిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా హెనగ్రేస్ చాలా చక్కగా ఆలపించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాడిన పాటగా వస్తున్న దీనికి నాగాదుర్గ హుషారుగా డాన్స్ చేసింది. ఆమె డాన్స్ చూస్తే ఈమెకు ఇదే తొలి సినిమానా లేక ఇంతకు ముందు చాలా సినిమాలు చేసిందా? అని సందేహం కలుగక మానదు. అంత చక్కగా చేసింది.    

ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్.బాల్ రెడ్డి, ఆర్ట్: ఆశిష్ తేజ పుల్లెల,ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి చేశారు. 

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష