మంత్రి కోమటిరెడ్డి వైద్య ఖర్చుల చెల్లింపుకు ప్రభుత్వం ఆమోదం

November 28, 2026


img

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి 17 వరకు, తిరిగి అక్టోబర్ 21 నుంచి 26 వరకు మంత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో ఆయనకు 4 వెసెల్ సెరిబ్రల్ యాంజియోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రామ్‌తో పాటు డ్యూరల్ ఏవీఎఫ్ ఎంబోలైజేషన్ చేశారు. వీటికి సంబంధించి మొత్తం బిల్లులు రూ.18.76 లక్షలు కాగా  ప్రభుత్వం ఆ మొత్తం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా ఆస్పత్రికి నేరుగా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. 


Related Post