రుస్తుం.. టైటిల్ గ్లింప్స్ విడుదల

November 28, 2026


img

యువ హీరో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘రుస్తుం.’ విరాట్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం  చిత్రబృందం ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేసింది. గతంలో చిరంజీవి నటించిన ‘రుస్తుం’ సినిమా ఇదే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్‌తో విరాట్ కర్ణ ఎలాంటి కథతో అలరించబోతున్నారో చూడాలి.

‘ఒక కొత్త ప్రపంచం.. మునుపెన్నడూ చూడని విధ్వంసం..’ అంటూ ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో గ్లింప్స్‌ వేశారు. ఈ సినిమాతో కనిష్క గంధం రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/SEqxcYVOxPw?si=TOZJIu4T6odH5ma2" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష